జాతీయ నులిపురుగులు నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా హైదరాబాద్ లోని షేక్ పేట లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో ఆల్బండజల్ టాబ్లెట్స్ ను విద్యార్థులకు అందించారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలతో పాటు అంగన్‌వాడీలలో సుమారు 98 లక్షల మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నామన్నారు.
పిల్లల ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదని మంత్రి దామోదర్ రాజనర్సింహా వెల్లడించారు. పిల్లలే జాతి సంపద అన్నారు , ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలందరూ ఆల్బండజల్ టాబ్లెట్స్ ను వేసుకోవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు .
