- అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వెలుపలకు కాలుష్య కారక పరిశ్రమలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదాయ వనరుల సమీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. సబ్ కమిటీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్ సమావేశంలో పాల్గొన్నారు. వాణిజ్య పన్నులు, ఖనిజాలు – భూగర్భ వనరుల శాఖలు ఆదాయ ఆర్జనలో మెరుగైన పనితీరు కనబర్చాయని సబ్ కమిటీ సభ్యులు అభినందించారు. సమావేశంలో రాజీవ్ స్వగృహ, హౌజింగ్ బోర్డు కార్యకలాపాల ప్రగతి పైనా సమీక్షించారు.