తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు.. మొక్కలు నాటిన ఎమ్మెల్యేలు

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 66 వ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్ లోని అసెంబ్లీ ఆవరణలో సహచర పార్లమెంట్ సభ్యులు మరియు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభాపక్ష కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్,జీవన్ రెడ్డి,ఎంపీ రంజిత్ రెడ్డి,ఎమ్మెల్యేలు డా”గాదరి కిశోర్ కుమార్,క్రాంతి కిరణ్ గారు,శానంపూడి సైదిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.