గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సూచనలు చేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో మోడరేట్ వర్షాలు కురుస్తున్నాయి.
సాయంత్రం నుండి అధిక వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు. నగరంలో వర్షాల నేపథ్యంలో హై అలెర్ట్ గా ఉన్నాం. ఉద్యోగులు, సెలవులు రద్దు చేసాం. ఉన్నత అధికారులను హెడ్ క్వార్టర్ లో ఉండాలని ఆదేశించాం. రిలీఫ్ కార్యకలాపాలను డిప్యూటీ కమిషనర్, స్థానిక తహసీల్దార్ లు చూసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ కి అప్లికేషన్ , కంట్రోల్ రూమ్, మీడియం ద్వారా వచ్చే ప్రజా ఫిర్యాదుల పై సత్వరమే స్పందిస్తున్నాం. మ్యాన్ హోల్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దు. మ్యాన్ హోల్ పై ఏమైనా ఫిర్యాదులు ఉంటే కంట్రోల్ రూమ్ కు విభాగాల అధికారులు, ప్రజలు తెలియజేయాలి. ట్రాఫిక్ చోకింగ్ పాయింట్ లపై ప్రత్యేక ఫోకస్ పెట్టాం. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్, హైడ్రాతో సమన్వయం చేసుకుంటున్నాం.