విద్యాశాఖలో 412 పోస్టులకు అనుమతి

రాష్ట్రవ్యాప్తంగా డైట్‌ కళాశాలల్లో 412 అతిథి అధ్యాపకులు, కార్యాలయ సహాయకులు, డ్రైవర్ల పోస్టులకు ప్రభుత్వం అనుమతించింది. ఇందులో విద్యాశాఖ పరిధిలోని గ్రంథాలయాల్లో 173 పోస్టులున్నాయి. ఈ మేరకు ఆర్థికశాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాదిపాటు కొనసాగనున్న ఈ పోస్టుల్లో అతిథి అధ్యాపకులకు నెలకు రూ.23,400, డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.19,500, స్వీపర్లు, అటెండర్లకు నెలసరి వేతనం రూ.15,600గా ఖరారు చేశారు.