ఒక్క ఫోటో వెయ్యి భావాలను తెలియచేస్తుందని, రాష్ట్రంలో ఫోటోజర్నలిస్టుల సంక్షేమానికి వారిలో ప్రిఫెషనలిజం పెంపొందించేందుకు చర్యలు చేపడుతామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించిన ఫోటోగ్రఫి పోటీలలో విజేతలకు నేడు బహుమతి , నగదు పురస్కారం అందించే కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పంజాగుట్ట లోని ఒక ప్రయివేటు హోటల్ లో నిర్వహించిన ఈ ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, సమాచారశాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్. ప్రియాంక, సి.ఎం కార్యాలయం సీపీఆర్ఓ మల్సూర్ లు అతిధులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలమ్ చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమం సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కాలాన్ని బందించి మధుర స్మృతులను అందించే శక్తి ఒక్క ఫోటోగ్రఫేర్లకే ఉంటుందని, ఈ ఫొటోగ్రాఫర్లను ప్రోత్సహించే దిశగా ప్రతీ సంవత్సరం వరల్డ్ ఫోటోగ్రఫిడే అధికారికంగా నిర్వహించి, ఫోటో కాంపిటిషన్లలో విజేతలను నగతు బహుమతులు, మెమెంటో ప్రదానం చేస్తున్నామని వెల్లడించారు. మాయని జ్ఞాపకాల, తీయాని కల ఫోటోగ్రఫి అని పేర్కొంటూ, ఎన్నో దశాబ్దాలు గడిచినా ఒక్క ఫోటో మాయని గత స్మృతుల్ని తెలియచేస్తుందని అన్నారు. రాజీవ్ గాంధీ హత్యోదంతాన్ని గుర్తు చేస్తూ, ఆ సంఘటనలో ఉన్న ఫోటోగ్రాఫర్ తీసిన చిత్రం ద్వారానే హంతకులను పట్టుకున్న ఉదంతాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు మాట్లాడుతూ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేది ఫోటో జర్నలిస్టులని అన్నారు. స్వాతంత్రోద్యమం నుండి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రచార మాధ్యమాలు కీలక పాత్ర వహిస్తున్నాయని, వీటిలో ఫోటో గ్రఫీ కి అంతంత ప్రాధాన్యత ఉందన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ప్రియాంక మాట్లాడుతూ, కాలం గడచినా, ఫోటోలు మాత్రం చెక్కుచెదరకుండా ఉంది మధుర స్మృతులను మిగులుస్తాయని పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవాలన్నీ సమాచార శాఖ ఆధ్వర్యంలో గత 28 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈసారి 5 విభాగాలకు నిర్వహించిన ఫోటో కాంపిటీషన్ కు 94 మంది పాల్గొని 744 ఫోటోలను పంపించారని చెప్పారు. ఫోటోగ్రఫి రంగంలో నిష్టాతులైన వారిచే ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ విజేతలను ఎంపిక చేసిందని వివిఆరించారు. ప్రధానంగా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు,చేయూత, రాజీవ్ యువ వికాసం, జనరల్ అనే ఐదు విభాగాలుగా ఎంట్రీలను ఆహ్వానించి ప్రతీ విభాగానికి 8 బహుమతులను ప్రకటించామని తెలియ చేశారు. ఈ సందరబంగా ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవ పోటీలలో విజేతలకు నగదు , శాలువాతో పాటు మెమెంటో ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సి.ఎస్. రామకృష్ణా రావు, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ ప్రియాంక, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సీపీఆర్ఓ మల్సూర్ లు అందచేశారు.
