ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు 66వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ, సంస్థ ఉద్యోగులు, సిబ్బంది, పౌరసరఫరాల శాఖ స్టేక్ హెల్డర్స్ రైస్ మిల్లర్లు, రేషన్ డీలర్లు, ఇతర ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున హరితహారంలో పాల్గొని 66 వేల మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు. గోదాముల్లో, రైస్ మిల్లుల ఆవరణలు, రేషన్ షాపులు, పెట్రోల్ బంక్స్ వద్ద మొక్కలు నాటారు.హైదరాబాద్లోని పౌరసరఫరాల భవన్ ఆవరణలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ పి. సత్యనారాయణరెడ్డి, ఇతర అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ పర్యావరణంపై ముఖ్యమంత్రికి ఉన్న మమకారాన్ని దృష్టిలో ఉంచుకొని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి 66వ జన్మదినం సందర్భంగా 66 వేల మొక్కలను నాటి ఆయనకు కానుకగా ఇవ్వడం జరిగింది. కమిషనర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ మొక్కలు నాటడం అనేది ఒక నిరంతర ప్రక్రియ కావాలన్నారు.ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జాయింట్ కమిషనర్ ఉషారాణి, డిప్యూటీ కమిషనర్లు శారదా ప్రియదర్శిణి, ప్రసాద్ కుమార్, సంస్థ జనరల్ మేనేజర్లు నాగేందర్ రెడ్డి, శ్రీమతి జి. వాటితో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంప నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.