- ప్రధాని మోదీకి మంత్రి తుమ్మల లేఖ
- వ్యవసాయ యంత్ర పరికరాలపై 12 శాతం జీ.ఎస్.టీ మినహాయింపు చేయాలని విజ్ఞప్తి
- ప్రధాని మోదీ ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
- కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంత్రి తుమ్మల లేఖలు
- ఎవరైనా డీలర్లు ఎక్కువ ధరకు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్
దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన వ్యవసాయ రంగం మన జనాభాలో అరవై ఐదు శాతం పైగా జనాభాకు జీవనాధారం. దేశ జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు పంటలు ఉత్పాదకతలో ఆధునిక సాగు పద్ధతులు రైతాంగం అమలు చేయాలంటే వ్యవసాయ యాంత్రీకరణ దిశగా రైతులను ప్రోత్సహించాలి.కానీ వ్యవసాయ యంత్రాలు పరికరాలు పై 12 శాతం జీ ఎస్ టీ విధించడం వల్ల రైతాంగం కు ఆర్ధిక భారంగా మారింది. సన్నకారు రైతులు వ్యవసాయ పరికరాలు కొనే స్థోమత లేక సాగు యాజమాన్య పద్ధతులు పాటించ లేక దిగుబడులు తక్కువగా ఉండటం సాగు పెట్టుబడులు భారంగా మారాయి. ఆధునిక సాగు యాజమాన్య పద్ధతులు పాటించేలా కూలీల కొరత పెట్టుబడులు భారం లేకుండా సన్నకారు రైతులకు మేలు జరిగేలా 12 శాతం జీ.ఎస్.టీ. మినహాయించడం చేయాలని ప్రధాని మోదీకి ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. తెలంగాణ రైతాంగంకు మాత్రమే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా రైతాంగం కు మేలు చేసేలా 12 శాతం జీ.ఎస్.టీ. మినహాయించడం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
రైతులకు యూరియా స్టాక్ ఎప్పుడు వస్తుందో తెలిసేలా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని మంత్రి తుమ్మల జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. యూరియా లభ్యతపై జిల్లా వ్యవసాయ అధికారులతో వ్యవసాయశాక కమిషనరేట్ లో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యూరియా స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలి అని అన్నారు. జిల్లాలకు వచ్చే యూరియా ముందుగానే తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఆ రేక్ నుంచి వివిధ జిలాల్లకు వెంటనే యూరియాను తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ట్రాన్స్ పోర్టింగ్ లో సమస్యలు ఉన్నట్టయితే కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. మండలాల వారిగా యూరియా స్టాక్ మరియు అవసరాలు తెలుసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అలాగే ప్రైవేట్ డీలర్ల వద్ద నున్న యూరియా నిలువలను కూడా రైతులకు అమ్మే విధంగా చూడాలని మరియు క్యూ లైన్ లేకుండా చూడాలని సూచించారు. మండలాలలో ప్రతి స్టాక్ పాయింట్ వద్ద యూరియా నిలువలను మానిటర్ చేయాలని, ఎక్కడ అవసరం ఉంటే అక్కడకు యూరియా ను తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎవరైన ప్రైవేట్ డీలర్లు ఎక్కువ ధరకు అమ్మినట్టయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిస్టాక్ పాయింట్ ను మండల వ్యవసాయ అధికారులతో, ఏఈఓలతో నిత్యం పర్యవేక్షించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ సీజన్ త్వరగా ప్రారంభంకావడం, వర్షాలు ముందుగా రావడం, సాగర్ నీరు త్వరగా విడుదల చేయడంతో జూన్ లో వేయవలిసిన పత్తి, మొక్కజొన్నలాంటి పంటలు ముందుగానే వేసుకోవడం జరిగిందని, దానికి అనుగుణంగా కేంద్రం యూరియా సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. యూరియా అమ్మకాలలో పాస్ బుక్ అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరారు. రైతులు నానో యూరియాను వాడేలా ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ డైరెక్టర్ Dr B.Gopi మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు..