- ఉమ్మడి జిల్లాల వారీగా హ్యామ్ ప్రపోజల్స్
- గతంలో పూర్తిగా విస్మరించిన వెనుక బడిన జిల్లాలకు మొదటి ప్రాధాన్యత
- ట్రాఫిక్ ఉన్న రోడ్ల కు అధిక ప్రాధాన్యత
- అధిక వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిన్న రోడ్ల కోసం అత్యవసరంగా 100కోట్లు రిలీజ్ చేయమని సీఎం ను కోరుతా
- ఫీల్డ్ నుండి పూర్తి వివరాలు పంపించాలి
- రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ భూ సేకరణలో భూమి కోల్పోయిన వారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలి
- ఆర్.అండ్.బి. శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
ఉమ్మడి జిల్లాల వారీగా తుది హ్యామ్ ప్రపోజల్స్ రూపొందించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం నాడు ఎర్రమంజిల్ ఆర్ అండ్ బి కార్యాలయంలో శాఖపై సుధీర్ఘంగా నాలుగు గంటలకు పైగా మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,దేవరకద్ర ఎమ్మెల్యే మధు సూదన్ రెడ్డి,రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి,స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్,ఆర్ అండ్ బి సి.ఈ లు జయ భారతి,మోహన్ నాయక్, రాజేశ్వర్ రెడ్డి,లక్ష్మణ్ అన్ని జిల్లాల ఎస్.ఈ లు,ఈ.ఈ లు పాల్గొన్నారు.
గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిన వెనుక బడిన జిల్లాలకు హ్యామ్ లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. హ్యామ్ రోడ్ల కోసం కొత్తగా భూ సేకరణ అవసరం లేదు కాబట్టి అదనపు భారం ఏమి ఉండదని మంత్రి పేర్కొన్నారు. ట్రాఫిక్ ఉన్న రోడ్ల కు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. హ్యామ్ ప్రపోజల్స్ లో 10కి.మీ పైగా ఉన్న రోడ్లను తీసుకోవాలని.. కనెక్టివిటీ కారిడార్ ను డెవలప్మెంట్ చేసే విధంగా ఉండాలని సూచించారు. దీంతో రూరల్ తెలంగాణ సోషియో ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందన్నారు. హ్యామ్ లో సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్..డబుల్ లేన్ నుండి పీవుడ్ షోల్డర్స్ (10 మీటర్ల) రోడ్డు..ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ఫోర్ లేన్ రోడ్స్ కొన్ని హ్యామ్ లో తీసుకుంటామన్నారు. దాదాపుగా 4వేల కి.మీ రోడ్లు రెన్యువల్ చేస్తామన్నారు. కొత్త ఇన్ఫ్రా పెంచడంతో పాటు పాత రోడ్ల మెయింటెనెన్స్,బలోపేతం చేస్తామని వివరించారు.
దీంతో పాటు అధిక వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిన్న రోడ్ల కోసం అత్యవసరంగా 100కోట్లు రిలీజ్ చేయమని సీఎం రేవంత్ రెడ్డి నీ కోరుతానని మంత్రి చెప్పారు. ఫీల్డ్ నుండి పూర్తి వివరాలు తెప్పించాలని సి.ఈ మోహన్ నాయక్ ను మంత్రి ఆదేశించారు. వచ్చే రెండు సంవత్సరాలలో హైకోర్టు,ఉస్మానియా ఆసుపత్రి,ప్రధాన బిల్డింగ్స్ అన్ని పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ భూ సేకరణలో భూమి కోల్పోయిన వారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలనీ అధికారులను మంత్రి ఆదేశించారు.