ఇద్దరు కారుణ్య నియామకాలు

హైదరాబాద్ : సమాచార పౌర సంబంధాల శాఖలో కారుణ్య నియామకాల క్రింద ఇద్దరికీ జూనియర్ అసిస్టెంట్ గా నియమక పత్రాలను రాష్ట్ర రెవిన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందచేశారు. టి.రోహన్ కుమార్ కు Dy.EIE, రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. అదే విధంగా కుమారి ఎస్.ప్రియాంక కు RJD Multi Zone-2 లో జూనియర్ అసిస్టెంట్ గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరికి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌ సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి ఈ రోజు సచివాలయంలో కారుణ్య నియామకాల పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్.ప్రియాంక పాల్గొన్నారు.