రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు గచ్చిబౌలి లోని హిల్ రిడ్జ్ విల్లాస్ లో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చక్రధర్ రెడ్డితో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈసందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూమొక్కలు నాటుతుంటే నా బాల్యం గుర్తొచ్చింది. అందరు పచ్చగా ఉండాలంటే మొక్కలు నాటాలి. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. మొక్కలు నాటడం వల్ల ప్రపంచానికి సేవ చేసిన వారవుతాం ప్రతీ ఒక్కరు విధిగా మొక్కలు నాటాలి అన్నారు. ఈ సందర్భంగా సినిమా దర్శకులు 1) S.గోపాల్ రెడ్డి, 2) B. గోపాల్, 3) కోదండరామిరెడ్డి, 4) మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఈసందర్భంగా పచ్చదనం పై పాటను ఆలపించారు.
ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ నాయకుల పుట్టిన రోజులు ఆర్భాటంగా జరుగుతాయి. కానీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తీసుకున్న హరితహారం కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చింది. నిన్న మా అచ్చంపేట నియోజకవర్గంలో కూడ పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు.
రాబోయే 5-10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం హరితవనంగా మారుతుంది. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి. ఇలాంటి కార్యక్రమాన్ని చేప్పట్టిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం హరిత తెలంగాణ మారుతుంది అని. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా అద్భుతంగా ముందుకు పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిల్ రిడ్జ్ విల్లాస్ రెసిడెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు MAరాజు; రమేష్ ;బలరాం రెడ్డి, ఆదర్శ రాజు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.