- ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
- స్వర్గీయ ధ్యాన్ చంద్ కు ఘనమైన నివాళి
- ధ్యాన్ చంద్ జీవితము క్రీడా రంగానికి స్ఫూర్తి
- క్రీడా దినోత్సవం సందర్భంగా పలువురికి నగదు పురస్కారాలు
భారత క్రీడలకు చిరస్థాయిగా ప్రేరణ నిచ్చిన మహానుభావుడు ధ్యాన్ చంద్ స్ఫూర్తితో క్రీడా సమాజం ముందుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో జరిగినజాతీయ క్రీడా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన అద్భుతమైన క్రీడా ప్రతిభతో వరుసగా మూడు ఒలంపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన ధ్యాన్ చంద్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి క్రీడాకారుడు ఒలంపిక్స్ మెడల్స్ లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్న ప్రోత్సాహాన్ని అందుకొని తెలంగాణలో ఒలంపిక్స్ క్రీడలు నిర్వహించడమే కాదు ఒలంపిక్స్ పతాకలు సాధించడంలో కూడా తెలంగాణ క్రీడాకారులు ముందుండాలని మంత్రి అన్నారు.
నూతన క్రీడా విధానం ఇస్తున్న ప్రోత్సాహంతో క్రీడాకారులు తమ ప్రతిభను చాటి తెలంగాణ రాష్ట్రానికి వన్నె తేవాలని ఆయన కోరారు.
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది రోజులపాటు,అత్యంత ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు నిర్వహించి క్రీడా స్ఫూర్తిని చాటుతున్న తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని అన్నారు. ఒక ఏడాది కాలంలోనే అనేక క్రీడా కార్యక్రమాలు నిర్వహించి క్రీడా విధానం ప్రకటించి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ను క్రీడా ప్రముఖులు ప్రశంసిస్తున్నారని ఆయన తెలిపారు.మరిన్ని క్రీడా కార్యక్రమాలతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ క్రీడాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడాల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి, మాట్లాడుతూ, ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోనే వినూత్నమైన విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, హైదరాబాద్ నగరంలోనే కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో క్రీడా శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయని తెలిపారు.
నగదు పురస్కారాలు అందజేత
జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ఇటీవల వివిధ క్రీడాంశాల్లో పత కాలు సాధించిన
క్రీడాకారులకు నగదు పురస్కారాలతో సన్మానం చేశారు. 41 మంది క్రీడాకారులకు ఒక కోటి 29 లక్షల వరకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. వరల్డ్ ఆర్చరీ అండర్- 21 బంగారు పతకం సాధించిన చికితా తానిపర్తి కి ఐదు లక్షల నగదు పురస్కారాన్ని,
పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిని శృతికి ఐదు లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని షూటింగ్ క్రీడాకారిని ఇషా సింగ్ కు నాలుగు లక్షల నగదు పురస్కారాన్ని పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిని తుడి శ్రీ చందనకు 5 లక్షల నగదు పురస్కారాన్ని ఇండియన్ క్రికెట్ టీం ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కు 5 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని, జూలై 20 25 సౌత్ కొరియా జీ చైన్ లో జరిగిన 20వ ఆసియన్ రోలర్ స్కేటింగ్ సీనియర్ ఛాంపియన్ షిప్ లో పత కాలు సాధించిన తేజేష్, కాంతి శ్రీ, శ్రియా మురళి,ఎండూరు ఆకాంక్ష, చలంచర్ల జోహిత్, జియా జయేష్ పటేల్, రక్షిత్ మురళి ఎండూరు సంచిత చౌదరి, ప్రతీక్ లకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల నగదు పురస్కారాలను అందజేశారు. జూనియర్ ఓల్డ్ కెన్యాలో జరిగిన జూనియర్ వరల్డ్ రోల్ బాల్ పోటీలో నెగ్గిన ఎం శ్రీశాంకు 5 లక్షల రూపాయలు రూరల్ స్కేటింగ్ లో మాకన్ సౌరవ్ సింగ్, ఆర్ కావ్య శ్రీలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాలను మోక్షిత్ రామ్ రెడ్డికి 2 లక్ష రూపాయల నగదు, పురస్కారాన్ని, ఉమెన్స్ సాఫ్ట్ బాల్ ఆసియా కప్ లో పాల్గొన్న ప్రవల్లికకు రెండు లక్షల రూపాయలు, రోలర్ స్కేటింగ్ క్రీడాకారిని నయన శ్రీ కి 75 వేల పురస్కారం. షూటింగ్ క్రీడాకారుడు లీలా ప్రసాద్ రాజుకు 75 వేల రూపాయల నగదు పురస్కారం, షూటింగ్ క్రీడాకారిని కర్ణికకు 50 వేల నగదు పురస్కారం, చెస్ క్రీడాకారులు శివంశికకు 50 వేల నగదు పురస్కారం, అంద చెస్ క్రీడాకారుడు ఆకాశకు 75 వేల నగదు పురస్కారం అందజేశారు.
పారా క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు
ఈ జాతీయ క్రీడల్లో పారా క్రీడాకారులకు కూడా పెద్ద ఎత్తున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. పారా టైక్వాండో క్రీడాకారుడు గౌతమ్ యాదవ్ కు 5 లక్షల నగదు పురస్కారాన్ని పారాత్రోబాల్ క్రీడాకారిని భాగ్యకు రెండు లక్షల నగదు పురస్కారాన్ని పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి విజయ దీపికకు 75 వేల నగదు పురస్కారాన్ని, పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారుని కి 50 వేల నగదు పురస్కారాన్ని, పారా టైక్వాండో క్రీడాకారుడు కే శివకు నాలుగు లక్షల నగదు పురస్కారాన్ని పారా అథ్లెటిక్స్ క్రీడాకారిణి లోకేశ్వరికి మూడు లక్షల నగదు పురస్కారాన్ని పారా టైక్వాండో క్రీడాకారిణి కృష్ణవేణికి 3 లక్షల నగదు పురస్కారాన్ని, టైక్వాండో క్రీడాకారుడు ఎం లింగప్పకు 25 వేల నగదు పురస్కారాన్ని, పారా కరాటే క్రీడాకారుడు సాయి ప్రభాత్ కు 75 వేల నగదు పురస్కారాన్ని మంత్రి చేతుల మీదుగా అందజేశారు.
గురు వందనం ప్రారంభం
క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న కోచులకు ఆపదలో ఆపన్న హస్తం అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ రూపొందించిన గురు వందనం బీమా పథకాన్ని మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా ఇటీవల వివిధ పథకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులను తీర్చిదిద్దిన పలువురు కోచులను ఈ సందర్భంగా సన్మానించారు. పి రామకృష్ణ కయా కింగ్
కానోయింగ్ కోచ్, ఎం ప్రవీణ్ కుమార్ పవర్ లిఫ్టింగ్ కోచ్ నితేష్వరి దేవి కోచ్, రవికుమార్ హ్యాండ్ బాల్ కోచ్,ఖదీర్ రోలర్ ఐస్ కేటింగ్ కోచ్, ఎం శ్రీనివాస్ అథ్లెటిక్ కోచ్, స్కేటింగ్ కోచ్ అర్జున అవార్డు గ్రహీత అనుప్ కుమార్ యామ లను ఈ సందర్భంగా సన్మానించారు.
అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ అధికారులను సిబ్బంది పలువురుని ఈ సందర్భంగా సన్మానించారు. వివిధ క్రీడా కార్యక్రమాల్లో స్పోర్ట్స్ అథారిటీ సమన్వయం ఆకారం అందజేసిన ఫ్యూచర్ ఒలంపియన్స్ సంస్థకు హైదరాబాద్ రన్నర్స్ కు సెలబ్రేషన్ మేకర్స్ సంస్థ ప్రతినిధులను క్రీడా శాఖ మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోని బాలాదేవి, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి, కోశాధికారి సతీష్ గౌడ్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు కోచులు సిబ్బంది క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
