విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందుగానే నిర్ణయం తీసుకున్నది. ఆయన స్థానంలో విజిలెన్స్‌కు కొత్తబాస్‌గా 1998 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి విక్రమ్‌సింగ్ మాన్‌ను నియమిస్తూ సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
