రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా మోహన్‌నాయక్‌

 తెలంగాణ రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా జే మోహన్‌నాయక్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం రాష్ట్ర రహదారుల చీఫ్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్‌నాయక్‌కు రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఉత్తర్వులు జారీచేశారు.