ఏసీబీకి చిక్కిన న‌ల్ల‌గొండ‌ జిల్లా మ‌త్స్య శాఖ అధికారిణి..

న‌ల్ల‌గొండ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా మ‌త్స్య శాఖ అధికారిణిగా ప‌ని చేస్తున్న ఎం చ‌రిత రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు. ఫిష‌రీస్ కో ఆప‌రేటివ్ సొసైటీలో కొత్త స‌భ్యుల పేర్ల న‌మోదుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరగా, అందుకు ఆమె లంచం డిమాండ్ చేశారు. ఇవాళ బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండ‌గా చ‌రిత రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆమెను కోర్టులో హాజ‌రు ప‌రిచి రిమాండ్‌కు త‌ర‌లించారు.