- ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామాలనికి ప్రణాళికలు
- పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూట్ మ్యాప్
- కొత్తగా మంజూరు అయిన ఎత్తిపోతల పధకాల పూర్తికి చర్యలు
- అటవీశాఖ అనుమతులు సత్వరమే పూర్తి చేయాలి
- భూసేకరణను వేగవంతం చేయాలి
- పునరావాస ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పర్వవేక్షించాలి
2027 డిసెంబర్ మాసాంతానికి ఎస్.ఎల్.బి.సి పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు సమృద్ధిగా అందించడంతో పాటు సురక్షితమైన త్రాగునీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే విదంగా హైలెవల్ కెనాల్ నుండి లో లెవల్ కేనాల్ పనులు పూర్తి చేయడంతో పాటు ఎస్.ఎల్.బి.సి ప్రారంభం అయితే లోలెవల్ కెనాల్ పంప్ హౌజ్ ల ద్వారా సరఫరా చేస్తున్న నీటి వినియోగానికి గాను నెల వారిగా చెల్లిస్తున్న కోటి రెండు లక్షల విద్యుత్ భారం నుండి బయట పడగలమని ఆయన తెలిపారు. మంగళవారం రోజున హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీ లోని నీటిపారుదల శాఖా ప్రధాన కార్యాలయం జలసౌధ లో నల్లగొండ, భోనగిరి లోకసభ నియోజకవర్గాలలో ప్రాజెక్టుల పురోగతి పై ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,రోడ్లు భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్,శాసనసభ్యులు బాలు నాయక్,వేముల విరేశం,కుంభం అనిల్ రెడ్డి,కుందూరు జయదీర్ రెడ్డి,బత్తుల లక్ష్మారెడ్డి,మందుల సామ్వైల్,నీటిపారుదల శాఖా సలహాదారులు అదిత్యా దాస్ నాధ్,లెఫ్టినెంట్ జెనరల్ హార్పల్ సింగ్,ప్రత్యేక అధికారి పరిక్షిత్ మేహ్ర,ఆర్&ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు,నల్లగొండ, భోనగిరి యాదాద్రి, సూర్యపేట జిల్లాల కలెక్టర్లు ఇల త్రిపాఠి, మంత్రిప్రగడ హనుమంత రావు,తేజస్ నందాలాల్ పవర్ లతో పాటు ఇ.ఎన్.సి లు అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేష్ బాబు సి.ఇ అజయ్ కుమార్ ఇతర నీటిపారుదల శాఖా ఇంజినీర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎస్.ఎల్.బి.సి ని డిసెంబర్,2027 నాటికి పూర్తి చేసే లక్ష్యంగా పెట్టుకుని రూట్ మ్యాప్ రూపొందించినట్లు ఆయన తెలిపారు. మెల్ బోర్న్ హెలికాప్టర్ సర్వే నిర్వహించి ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. ఎస్.ఎల్.బి.సి పునరుద్ధరణ అంశంపై నీటిపారుదల శాఖా ఇంజినీర్లు రూపొందించిన నివేదికను ఈ నెల 15న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి మంత్రివర్గ ఆమోదంతో పనులు మొదలు పెడతామని ఆయన స్పష్టం చేశారు. ఆందుకు సంబంధించిన టన్నెల్-1,పెండ్లిపాకల రిజర్వాయర్,టన్నెల్-2 ను పూర్తి చేసుకుని 25 కిలో మీటర్ల మెయిన్ కెనాల్ ద్వారా హైలెవల్ కేనాల్ లో కలిపి సాగునీటిని అందిస్తామన్నారు. అందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. యస్.ఎల్.బి.సి పూర్తి అయితే హైలెవల్ కేనాల్ ద్వారా 2 .20 వేలు,ఉదయసముద్రం ద్వారా లక్ష ఎకరాలకు, లో లెవల్ కేనాల్ ద్వారా 80,000 వేల ఏకరాలకు సాగు నీరు మారుమూల గ్రామాలకు సురక్షిత త్రాగునీరు అందిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
అదే విదంగా డిండి ఎత్తిపోతల పధకం పూర్తి చేయడం ద్వారా 8 రిజర్వాయర్ల నుండి 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా పనులు సాగుతున్నాయన్నారు. సింగరాజ్ పల్లి రిజర్వాయర్ ద్వారా 13,000 వేల ఎకరాలకు,ఎర్రబెల్లి-గోకారం ద్వారా 6,000 వేల ఎకరాలకు,ఇర్శిన్ ద్వారా 10,000 వేల ఏకరాలకు,గొట్టెముక్కూల ద్వారా 28,000 వేల ఏకరాలకు,చింతపల్లి ద్వారా 15,000 వేల ఎకరాలకు,కృష్ణరాంపల్లి ద్వారా లక్ష ఏకరాలకు,శివన్నగూడెం ద్వారా 1,55,000 ఎకరాలకు అందించేందుకు గాను పనులు వేగవంతం చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే డిండి ప్రాజెక్టుకింద 30,000 వేల ఏకరాలు ,ఉలపర కింద 4,000 ఎకరాలకు నీరు అందుతోందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకంలో బాగంగా నిర్మించిన ఎదుళ్ల రిజర్వాయర్ నుండి దుందుభి వాగు వరకు నీటిని రప్పించేందుకు ఐదు ప్యాకేజ్ లుగా విభజన చేసి పనులు ప్రారంభించినట్లు ఆయాన చెప్పారు. అయితే అటవీశాఖ అనుమతులు ఇతరత్రా కారణంగా నిలిచిపోయిన చింతపల్లి, ఇర్శిన్ రిజర్వాయర్ల పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదే విదంగా హెడ్ రిచ్ నుండి కాలువల నిర్మణాలకు గాను త్వరితగతిన సర్వే పూర్తి చేసి టెండర్ల ప్రక్రియ ప్రారంబించాలని అధికారులకు ఆయన సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గాను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీదట నీటి లభ్యతను ఆధారం చేసుకుని కొత్తగా 11 ఎత్తిపోతల పధకాలు నిర్మణాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఒక్క మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోనే ఐదింటికి అనుమతులు మంజూరు చేయగా మిగిలిన చోట్ల మరో ఐదింటికి అనుమతించామన్నారు. ఈ ఎత్తిపోతల పధకాలు అన్నింటినీ పూర్తిచేస్తే 15,000 వేల ఎకరాలు స్థిరీకరణ తో పాటు కొత్తగా 14,506 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని సమృద్ధిగా అందించగలమన్నారు.
ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన ఉదయసముద్రం పనులు ఇప్పటికే 70%పూర్తి కాగా మిగిలిన పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించమన్నారు.ఉదయ సముద్రం పరిధిలోని బ్రాహ్మణవెళ్ళేంల రిజర్వవాయర్ పూర్తి అయిందని కెనాల్ నెట్ వర్క్ పనులు పురోగతిలో ఉన్నాయాన్నారు. సుదీర్గ కాలంగా పెండింగ్ లో ఉన్న పిల్లాయిపల్లి,ధర్మారెడ్డి పల్లి,బునాదిగాని కాలువల పూర్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.పిల్లాయి పల్లి కాలువ ద్వారా 22,500 ఏకరాలకు సాగునీరు అందుతుందని అందులో 16,525 ఎకరాల స్థిరీకరణతో పాటు 5,975 ఏకారల కొత్త ఆయకట్టు సేద్యంలోకి వస్తుందన్నారు. ధర్మారెడ్డి పల్లి కాలువ పూర్తి అయితే 12,661 ఎకరాలను సేద్యం లోకి తీసుక రావడంతో పాటు 5,126 ఎకరాలు స్థిరీకరణ జరుగుతుందన్నారు. అదే విదంగా బునాదిగాని కాలువ పూర్తి అయితే 6,000 ఎకరాలను స్థిరీకరించడంతో పాటు 14,575 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని ఆయన తెలిపారు. బస్వాపూర్ రిజర్వాయర్ పనులు 93%పూర్తి అయ్యాయని మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయాన్నారు. ఇది పూర్తి అయితే 23,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అదే విదంగా గందమళ్ల రిజర్వాయర్ పరిధిలోని రావెల్ కోల్ లింక్ కెనాల్,ప్యాకేజ్ 16,తురకపల్లి కేనాల్,యం.తురకపల్లి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.