ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వం: ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి

  • ప్రజావాణి లో 232 దరఖాస్తులు
  • లబ్దిదారులకు సిఎం సహయనిధి చెక్కులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిఎం ప్రజావాణి కార్యక్రమంలో ఈరోజు (శుక్రవారం) 232 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో గృహ సంబంధిత దరఖాస్తులు 88, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 101 దరఖాస్తులు, రెవెన్యూ శాఖ కు సంబంధించి 37 దరఖాస్తు లు వచ్చాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ కు సంబంధించి 16 దరఖాస్తులు వచ్చాయి. కాగా
ప్రవాసి ప్రజావాణి లో మూడు దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 75 దరఖాస్తు లు వచ్చాయని ప్రజావాణి అధికారులు తెలిపారు.
గతంలో తాము సమస్యలు చెప్పే అవకాశం ఉండేది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రజా వాణి కార్యక్రమంలో తమ సమస్యల్ని పరిష్కరించడం ఆనందంగా ఉందని ప్రజావాణి కి వచ్చిన ఫిర్యాదు దారులు అన్నారు. సమస్య పరిష్కారం కోసం నేరుగా అధికారులకు ఫోన్ చేయడంతో సత్వర పరిష్కారం అవుతున్నాయని వారు అన్నారు. ఈరోజు ప్రజావాణిలో ముఖ్యమంత్రి సహయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రివర్యలు జి.చిన్నారెడ్డి చెక్ లు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుని చర్యలతో ఏండ్లుగా పరిష్కారం నోచుకోని ఎన్నో సమస్యలు ఒక కొలిక్కి వస్తున్నాయని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. దొరల రాజ్యం లో దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, సిఎం ఒక్కొక్క సమస్య ను చక్కదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నారని వారు కొనియాడారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది అని ప్రజావాణి కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీమంత్రి జి.చిన్నారెడ్డి నోడల్ అధికారిగా దివ్య దేవరాజన్ , ఐఎఎస్ విశేష మైన సేవలు అందిస్తున్నారు వారు ఆనందం వ్యక్తం చేశారు.