మరింత పారదర్శకంగా MPLAD నిధుల వ్యయంపై ఈ-సాక్షి పోర్టల్

హైదరాబాద్: పార్లమెంటు సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అందచేస్తున్న నియోజక అభివృద్ధి నిధుల కేటాయింపు, పధకాల అమలు, వ్యయం (స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులు ) తదితర వివరాలను సామాన్యు ప్రజలు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ-సాక్షి అనే పోర్టల్ ప్రవేశ పెట్టింది. ఎంపీ లకు అందచేస్తున్నMPLAD నిధుల వినియోగంపై మరింత పారదర్శకత ఉండేందుకుగాను భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ-సాక్షి నిర్వహణా తీరుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో MPLAD పై జోనల్ శిక్షణాకార్యక్రమం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ గణాంక, ప్రణాళిక అమలు మంత్రిత్వశాఖ సహకారంతో నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో, దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో పాటు, తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య ప్రణాళిక అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిలాడ్స్ పథకానికి సంబంధించిన ఇ- సాక్షి పోర్టల్ అన్ని వివరాలను, అధికారులకు ప్రత్యేక్ష శిక్షణ తెలియచేసారు. MPLAD కింద మంజూరు చేసిన పనులు, వాటి పురోగతి, నిధుల వ్యయం తదితర అంశాలను పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (PFMS) ద్వారా మ్యాపింగ్ చేయడం, తద్వారా సంబంధిత అధికారులు డిజిటల్ ప్రక్రియలను మరింత మెరుగ్గా అవగాహన చేసుకోవడంతో పాటు, సందేహాలను వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రణాళికా శాఖ డైరక్టరు రూఫస్ దత్తం తెలిపారు. ఈ వర్క్ షాప్ కు గణాంకాలు మరియు ప్రణాళిక అమలు మంత్రిత్వశాఖ అడిషనల్ సెక్రటరీ పూజాసింగ్ మండోల్, డిప్యూటీ డైరక్టర్ జనరల్ జోసెఫ్ లు హాజరై తగు శిక్షణను అందచేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక అమలు మంత్రిత్వశాఖ అధికారులు మరియు రాష్ట్ర ప్రణాళికాశాఖ అధికారులు పాల్గొన్నారు.