సొసైటీ ఫర్ రూరల్ డెవల్‌పమెంట్ సర్వీస్ (ఎస్ఆర్డీఎస్)కు మెంబర్ సెక్రటరీగా ఎం.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాస్ ఇంతకుముందు పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.