వైస్ చాన్స్లర్ల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వీసీ నియామక ప్రక్రియ పూర్వరంగంలో, సెర్చ్ కమిటీ నుండి పేర్లు తెప్పించుకుని ముందుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల నియామకాలు సత్వరంగా పూర్తి చేయాలని కూడా సీఎం ఆదేశించారు. దీనివల్ల వీసీల నియామక ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని కేసీఆర్ అన్నారు. రాబోయే రెండు-మూడు వారాలలో ఇదంతా జరగాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.