తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను అన్ని రంగాల్లో అభివృద్ధ్ది పర్చాలనే ఉద్దేశంతో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత విస్తృత పరిచి రెగ్యులర్గా కొనసాగించాలనే ఆలోచనతో ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్ లో పంచాయతీ రాజ్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, శాసన మండలి విప్ కర్నె ప్రభాకర్, నల్గొండ జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ , ఎం.ఎల్.సి. తేరా చిన్నప రెడ్డి గారు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, రవీంద్ర కుమార్, చిరుమర్తి లింగయ్య, ,ఎన్.భాస్కర్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటీల్, అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, రాహుల్ శర్మ, ZP CEO సీత కుమారి, ICDS RO మాలె శరణ్య రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మెన్ సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సమ్మేళనం ముఖ్య విషయాలు …
👉గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసమే సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
👉ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తో పల్లె ప్రగతి విజయవంతం అయ్యింది.
👉పల్లెప్రగతి కార్యక్రమం వల్ల గ్రామాల్లో ప్రజల మధ్య ఐక్యత పెరిగింది.
👉ప్రతి గ్రామంలో చెట్లు నాటి గ్రామాలను పచ్చగా , నందనవనం లా మార్చుకోవాలి .
👉ఇదే స్ఫూర్తితో పల్లెప్రగతి ని నిరంతరం కొనసాగించాలి.
👉ప్రతి నెల క్రమం తప్పకుండా సీఎం కేసీఆర్ పల్లెల బాగు కోసం నిధులను విడుదల చేస్తున్నారు.
👉పోరాడి సాధించుకున్న తెలంగాణ ను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం.
👉త్వరలో చేపట్టబోతున్న పట్టణ ప్రగతి ని కూడా అందరూ చేయి చేయి కలిపి. విజయవంతం చేయాలి.
👉స్థానిక కౌన్సిలర్లు, అధికారులు ,,స్థానిక ప్రజలతో మమేకమై వార్డ్ లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవాలి.