
తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మా ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3న పీటీ ఈసెట్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలియజేశారు. గడువు ముగిస్తే ఆలస్య రుసుముతో మే 26 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 20 నుంచి మే 27 వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మే 28 నుంచి మే 31 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు జరుగుతాయి అన్నారు. జూన్ 15న ఫలితాలు వెల్లడిస్తారు.