రిటైర్డ్‌ జర్నలిస్టులకు పెన్షన్‌ వర్తింపజేయాలి

 రిటైర్డ్‌ జర్నలిస్టులకు పెన్షన్‌ వర్తింపజేయాలని వయోధిక పాత్రికేయ సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం నేతలు కేశవరావు, లక్ష్మణ్‌రావు, ఎన్‌ శ్రీనివాస్‌రెడ్డి, బండారు శ్రీనివాసరావు, సీ కేశవులు, ఫాజిల్‌, వేణుగోపాల్‌తో కూడిన బృందం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రజాభవన్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.