గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వరల్డ్ ఫేమస్ డ్రమ్స్ శివమణి మరియు బాసిస్టు మోహిని డే

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మాదాపూర్ లోని సీసీఆర్టీ లో మొక్కలు నాటిన వరల్డ్ ఫెమస్ డ్రమ్మిస్ట్ శివమణి, ఫెమస్ బాసిస్ట్ (గీటారిస్టు) మోహిని డే, సంగీత కారుడు వేణు గాణం నాగరాజు; గాయనీ శ్రీమతి మణి నాగరాజు ; సీసీఆర్టీ అధికారులు తాడేపల్లి సత్యనారాయణ, చంద్రశేఖర్, ఈ సందర్భంగా శివమణి గారు మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉన్నది. “ఆట కాదురా శివ ప్రోగ్రాం” కోసం నేను హైదరాబాద్ కు వచ్చాను. ఇక్కడ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కాదంబరి కిరణ్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థవారు big surprise ఇచ్చారు. నన్ను మొక్కలు నాటాలని కోరడం చాలా ఆనందం, సంతోషం గా ఉంది. అందరు కూడా మొక్కలు నాటాలి బర్త్ డే సందర్భంగా బహుమతులు కాకుండా మొక్కలు కొని ఇవ్వాలని వాటిని సంరక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు రాఘవా, కిషోర్ గౌడ్, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.