డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని రాయవరం గణపతి గ్రాండ్ బాణసంచా ( Fire Factory) తయారీ కేంద్రంలో పేలుడు (Explosion) చోటు చేసుకోగా ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ అగ్నికీలల్లో చిక్కుకుని బుధవారం ఆరుగురు సజీవ దహనం కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.