ఏపీలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు

ఆంధ్రప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ లను బదిలీ చేసింది. మొత్తం 31 మంది అధికారులను బదిలీ చేయడం సంచలనం రేపింది. కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చక్రధర్‌బాబు, వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా మనజీర్‌జిలానీ సామున్‌, ఏపీపీఎస్సీ సెక్రటరీగా రవిసుభాష్‌ ను నియమించింది. ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీగా శివశంకర్‌ లోతేటి, పౌరసరఫరాలశాఖ వైస్‌ చైర్మన్‌గా ఎస్‌.ఢిల్లీరావు, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా పి. రంజిత్‌ బాషాను నియమించింది.