సమాచార హకు చట్టం-2025లో భాగంగా ఉత్తమ పనితీరు కనపరిచిన విభాగాధిపతిగా ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు ఈ ఏడాది పురస్కారం దక్కింది. ఈ అవార్డును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హైకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా ఎక్సైజ్‌శాఖ కమిషనర్ చెవ్వూరి హరికిరణ్ అందుకున్నారు. ఐదేండ్లలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నుంచి సమాచార హక్కు కింద.. వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించినందుకు ఆయనకు ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డును ఎక్సైజ్ శాఖ సిబ్బందికి అంకితమిచ్చిన కమిషనర్.
