బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం శనివారం బీసీ సంఘాలు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బీసీ బంద్‌కు అన్నీ పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. తెలంగాణ జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా అమలైంది. అన్ని నియోజకవర్గాల్లో అన్నీ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాలుపంచుకున్నారు.