నేరస్తులను కఠినంగా అణిచివేస్తాం: డీజీపీ శివధర్ రెడ్డి

కరుడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్‌కు డీజీపీ శివధర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో లా అండ్ ఆర్డర్‌ను పూర్తిస్థాయిలో కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ నిబద్ధతతో ఉందని తెలిపారు. ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణిచివేస్తామని స్పష్టం చేశారు.