నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు, రౌడీషీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. ఆదివారం నాడు రియాజ్‌ను పోలీసులు పట్టుకున్నప్పటికీ తీవ్ర గాయాలు కావడంతో అతడిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి నుంచి తప్పించుకునేందుకు పోలీసుల గన్ లాక్కోవడంతో ఆత్మరక్షణ కోసం రియాజ్‌ను కాల్చిచంపారు.