“తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే లో పాల్గొన్న 3 లక్షల మంది*

  • ఈ నెల 25తో ముగియనున్న సర్వే

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వే లో కేవలం తెలంగాణ నుండే వివిధ ప్రాంతాల నుండి దాదాపు మూడు లక్షలకు పైగా పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందచేశారు.భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేను చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వతేదీ తో ముగుస్తుంది. ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in /telanganarising అనే వెబ్సైట్ లో సందర్శించి ప్రతీ ఒక్కరు తమ సలహాలు సూచనలను అందించాల్సింగా ఒక అధికార ప్రకటనలో తెలియ చేశారు