ఆర్.అండ్.బి అధికారులు ఫీల్డ్ లెవెల్ లో హై అలెర్ట్ గా ఉండాలి. అత్యవసరం ఐతే తప్పా.. ఎవరూ సెలవుపై వెళ్లొద్దు. మాన్సూన్ సీజన్ లో చేపట్టిన జాగ్రత్త చర్యలు.. అదే స్పూర్తితో కొనసాగించాలి. ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు, రెవెన్యూ,విద్యుత్, ఇరిగేషన్,పిఆర్ శాఖలతో సమన్వయం చేసుకోవాలి అన్నారు. లో కాజ్ వేలు, కల్వర్టులు వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలి. ఆర్.అండ్.బి. ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ సెంటర్ అన్ని జిల్లాలతో అనుసంధానం చేయాలి. అత్యవసరమైతేనే ప్రజలు రోడ్లపైకి రావాలి, అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి.
“మొంథా” తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్.అండ్.బి. శాఖ అధికారులను రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అప్రమత్తం చేశారు. బుధవారం నాడు ఆర్.అండ్.బి. ఈఎన్సిలు, సి.ఈ లు, ఎస్.ఈలతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. ఆర్.అండ్.బి. అధికారులు ప్రతి ఒక్కరు ఫీల్డ్ లెవెల్ లో హై అలెర్ట్ గా ఉండాలనీ, అత్యవసరం అయితే తప్పా ఎవరూ సెలవు పై వెళ్లొద్దనీ మంత్రి స్పష్టం చేశారు. మాన్సూన్ సీజన్ లో ఆర్.అండ్.బి. ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో చేపట్టిన జాగ్రత్త చర్యలు ప్రశంసనీయమని..అదే స్పూర్తినీ ఈ సమయంలో కూడా కొనసాగించాలనీ అన్నారు. లో కాజ్ వే లు,కల్వర్టులు వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలనీ,ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పిఆర్ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఆర్.అండ్.బి. ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ అన్ని జిల్లాలతో అనుసంధానం చేయాలనీ,ఆర్ అండ్ బి సర్కిల్ వారిగా అన్ని జిల్లాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.ఎమర్జెన్సీ ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలనీ,అందుకు తగ్గ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే ప్రజలు రోడ్ల పైకి రావాలనీ,అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
