- నెహ్రూ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల దూర దృష్టితో హైదరాబాద్ కుబలం
- జిసిసిల రాజధానిగా హైదరాబాద్
- మ్యాక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్, హైదరాబాద్ ప్రారంభోత్సవ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
తెలంగాణ ప్రతిభ పై విశ్వాసం పరిపాలనపై నమ్మకానికి మ్యాక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ ఒక ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఆయన పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి టీ హబ్ సమీపంలో మ్యాక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ ను ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. తెలంగాణ అద్భుత ప్రతిభకు మ్యాక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ కోసం హైదరాబాదును కేంద్రంగా ఎంచుకోవడం ఒక నిదర్శనం అన్నారు. Gcc లకు రాజధానిగా హైదరాబాద్ నిలిచిందని డిప్యూటీ సీఎం తెలిపారు. మాజీ ప్రధాని నెహ్రూ మొదలుకొని ఆ తర్వాత పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మహా నేతలు దూరదృష్టితో చేపట్టిన చర్యల మూలంగా హైదరాబాద్ కు మరింత బలం చేకూరిందని డిప్యూటీ సీఎం వివరించారు. మ్యాక్డొనాల్డ్స్ గ్లోబల్ నాయకత్వ బృందాన్ని మరియు సిబ్బందిని హైదరాబాద్‌కు స్వాగతించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఇది ఇప్పుడు మీ ప్రపంచ ప్రతిభకు కొత్త నిలయం అని కంపెనీ ప్రతినిధులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం అన్నారు. 1940లలో మ్యాక్డొనాల్డ్స్ ప్రారంభమైనప్పుడు, అది కేవలం ఆహారం గురించి మాత్రమే కాదు అది పరిమాణం, సామర్థ్యం, మరియు అనుసంధానమైన ప్రపంచం అనే భావనకు ప్రతీకగా నిలిచింది అన్నారు. దశాబ్దాల క్రమంలో ఆ బంగారు చిహ్నాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ కోట్లాది మందికి సేవలు అందించే విధంగా ఆవిష్కరణ మరియు నిర్వహణ కలయికకు చిహ్నమయ్యాయి అరే డిప్యూటీ సీఎం వివరించారు.
మార్క్ నాఫ్లర్ రాసిన “Boom, Like That” పాటలో — మ్యాక్డొనాల్డ్స్ వ్యవస్థాపకుడు రే క్రాక్ కథకు ప్రేరణగా చెప్పినట్లుగా, మ్యాక్డొనాల్డ్స్ కథ అనేది ధైర్యవంతమైన ఆలోచనలు ఒకేసారి ఒక పల్లెలో ప్రపంచమంతా వ్యాపించిన గాథ అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే, హైదరాబాద్ కూడా అలాంటి ప్రయాణమే చేసింది అన్నారు. మినార్లు, సరస్సులతో ఉన్న చారిత్రక నగరం నుండి, డేటా, డిజైన్, నిర్ణయాల గ్లోబల్ హబ్‌గా ఎదిగింది అన్నారు. స్పష్టమైన లక్ష్యం ఉంటే, కేవలం ఒక నగరానికో, దేశానికో కాదు, ప్రపంచానికి సేవ చేయవచ్చు అని హైదరాబాదు నగరం మరియు మాక్ డోనాల్డ్ రెండు నిరూపించాయి అన్నారు.
భారతదేశ అభివృద్ధి క్రమాన్ని పరిశీలిస్తే పండిట్ జవహర్లాల్ నెహ్రూ దూరదృష్టిని మరవలేము అన్నారు. ఆయన ఆధునిక భారతదేశానికి పునాదులు వేశారు, వారి దూరదృష్టి పెట్టుబడి వల్లే హైదరాబాద్‌కు స్థిరమైన బలం వచ్చింది చేకూరింది అన్నారు. CCMB, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, BHEL, ECIL, మరియు ఇతర పబ్లిక్ సెక్టర్ సంస్థలు అన్నీ కూడా నెహ్రూ స్ఫూర్తి నుండి పుట్టినవే అని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. వారి తర్వాత ప్రధానిగా పనిచేసి పీవీ నరసింహారావు, వారి క్యాబినెట్లో డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రిగా నెహ్రూ దూరదృష్టిని మరింత బలంగా తీసుకెళ్లారు అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంతో ఆత్మవిశ్వాసంగా, జాగ్రత్తగా, కరుణతో అనుసంధానించారు అని వివరించారు.
ఆర్థిక సంస్కరణ అంటే కేవలం మార్కెట్ గురించి కాదు, గౌరవంతో కూడిన అవకాశాలను సృష్టించడం అని తెలిపారు. ఆలోచనలో భాగంగానే సమానత్వంతో కూడిన వృద్ధి, సమిష్టి అభివృద్ధి అనే అంశాలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు అని డిప్యూటీ సీఎం తెలిపారు.
మ్యాక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ఈ నూతన కేంద్రం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న కొత్త పరిణామంలో కీలక అధ్యాయం అని అభివర్ణించారు.
గత రెండు దశాబ్దాల్లో హైదరాబాద్ ఇటువంటి సెంటర్లకు రాజధానిగా మారింది, వందలాది గ్లోబల్ కెపబిలిటీ హబ్‌లు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి అని వివరించారు.
ఇవి అన్నీ మన ప్రతిభపై విశ్వాసం, మన పాలనపై నమ్మకం, మరియు మన భవిష్యత్తుపై ఆశకు ప్రతీకలు అన్నారు.. ఇవి కేవలం బ్యాక్ ఆఫీసులు కావు, ఇవి ప్రపంచ ఆవిష్కరణకు నాడులు అన్నారు. హైదరాబాదులోని జీసీసీ సెంటర్లు చికాగోను చార్మినార్‌తో, బోస్టన్‌ను బంజారాహిల్స్‌తో, లండన్‌ను లింగంపల్లితో కలుపుతున్నాయి, హైదరాబాద్‌ను ప్రపంచ కమాండ్ సెంటర్‌గా మార్చుతున్నాయి, అక్కడ మార్కెట్లను, అనుభవాలను తీర్చిదిద్దే నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి అన్నారు. మ్యాక్డొనాల్డ్స్ ఇక నుంచీ ఒక వ్యాపార సంస్థకన్నా ఎక్కువ. అది ఆశ, మానవ అనుభూతి, మరియు ఒకే బోజనంపై కలిసే మనుషుల బంధానికి ప్రతీక అని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. ఈ కొత్త గ్లోబల్ ఆఫీస్ ద్వారా ఆ స్ఫూర్తి కొత్త రూపంలో వెలుగులోకి వస్తోంది, హైదరాబాద్ ఇంజినీర్లు, విశ్లేషకులు, ఆవిష్కర్తల చేతుల్లో రూపుదిద్దుకుంటోంది. మ్యాక్డొనాల్డ్స్ తన సప్లై చైన్స్, సస్టైనబిలిటీ, డిజిటల్ అనుభవాలను పునర్నిర్మించినట్లే, హైదరాబాద్ కూడా టెక్నాలజీ మరియు మానవతా విలువలు కలిసిన నగరంగా మళ్లీ తనను పునర్నిర్వచిస్తోంది అన్నారు. మ్యాక్డొనాల్డ్స్ తెలంగాణ యువత కోసం నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలపై భాగస్వామి కాబోతుందన్న కాబోతుంది అన్న విషయం తెలంగాణ ప్రజానీకానికి ఆనందంగా ఉంది అన్నారు. ఈ భాగస్వామ్యం గ్లోబల్ సామర్థ్యాన్ని స్థానిక అవకాశంగా మార్చుతుంది. అలాగే పిల్లలు మరియు కుటుంబాల సేవలో ఉన్న రొనాల్డ్ మ్యాక్‌డొనాల్డ్ హౌస్ చారిటీస్ వంటి దాతృత్వ కార్యక్రమాలను కూడా అభినందిస్తున్నాను అన్నారు. దాతృత్వ కార్యక్రమాలు ఆలోచన తెలంగాణ ప్రభుత్వ తత్వశాస్త్రాన్ని ప్రతిబింబిస్తుంది అన్నారు. అభివృద్ధికి మానవీయ కోణం ఉండాలి అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ కొత్త మ్యాక్డొనాల్డ్స్ సెంటర్ కేవలం హైదరాబాద్ ఆకాశహర్మ్యాలలో మరో భవనం కాదు. ఇది భారత విశ్వాసానికి, తెలంగాణ ప్రతిభకు, గ్లోబల్ సంస్థలు, స్థానిక ప్రతిభ కలయికతో సృష్టించగల అద్భుతానికి ప్రతీక అని వివరించారు.
హైదరాబాద్ మీ ఆఫీస్ మాత్రమే కాదు, మీ భాగస్వామి కూడా అని కంపెనీ ప్రతినిధులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం అన్నారు. మనమందరం కలిసి, ప్రపంచంలోని ఉత్తమ ఆలోచనలకు భారతదేశంలోని అత్యంత చురుకైన హైదరాబాదులో అవకాశం కల్పిద్దాం అని డిప్యూటీ సీఎం అన్నారు. కార్యక్రమంలో డోనాల్డ్ కంపెనీ ప్రతినిధులు మిస్ స్కై ఆండర్సన్,
దేశాంత్ కైలా, మ్యాటిజ్ బ్యాక్స్, స్పీరో ద్రూలియాస్, శదాస్ దాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
