- కొల్లూరు డబల్ బెడ్ రూమ్ కాలనీ ని రాష్ట్రానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం
- డబల్ బెడ్ రూమ్ కాలనీ లో సంక్రాంతి నాటికి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ప్రారంభం : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
కొల్లూరు కాలనీ ని తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శవంతమైన కాలనీగా రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అధ్యక్షతన కొల్లూరు డబల్ బెడ్ రూమ్ కాలనీలో వి ఎస్ టి కంపెనీ సి ఎస్ ఆర్ నిధులు రూ.8 కోట్లతో నిర్మించనున్న 60 గదుల పాఠశాల, డైనింగ్ హాల్, అంగన్వాడి కేంద్రం నిర్మాణం పనులకు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, గృహ నిర్మాణ సంస్థ ఎండి గౌతమ్ ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భముగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ , సమాచార పౌరసంబందాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ … కొల్లూరు డబల్ బెడ్ రూమ్ కాలనీ భవిష్యత్తులో ఎంతగానో అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. సుమారు 15 వేల కుటుంబాలకు చెందిన లక్షమంది ప్రజలు నివాస ఉండేందుకు విలుగా కాలనీలో అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నది అన్నారు. కాలనీలో ప్రహరీ గోడ నిర్మాణం క్రీడా మైదానం ఏర్పాటు కు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. కాలనీ నుండి నాంపల్లి ,చార్మినార్ ,హైదరాబాద్ వైపు బస్సులు సౌకర్యం లేదని కాలనీవాసులు తెలపడంతో నాలుగు రోజుల్లో బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు.
కాలనీలో రూ 8 కోట్ల సిఎస్ఆర్ నిధులతో పాఠశాల భవన నిర్మాణానికి వి ఎస్ టి కంపెనీ ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈనెల 10 నుంచి సన్నబియ్యం అందేలా చర్యలు చేపట్టాలని ,పోలీస్ ఔట్ పోస్టును ఏర్పాటు చేస్తామని దీనికోసం తమ హౌసింగ్ శాఖకు చెందిన భవనాన్ని పోలీసు శాఖకు ఇస్తామని పేర్కొన్నారు .ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను మంత్రి అభినందించారు. వారం రోజులలో కాలనీలో పోలీసు పోస్టు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు పనిచేయని సీసీ కెమెరాలు వెంటనే మనుమతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
అనంతరం రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నదని అన్నారు. ప్రత్యేక కమ్యూనిటీలకు చెందిన కుటుంబాల చెందిన సుమారు లక్ష మంది ప్రజలు కాలనీలో నివాసం ఉంటున్నారని కాలనీలో నివాసం ఉండే వారికి విద్య వైద్య పరంగా అన్ని రకాల సేవలు అందేలా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. మీ ఇంటి ముంగిట్లోనే డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. సంక్రాతి కి కాలనీలో ఆరు పడకగదుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. కొల్లూరు డబల్ బెడ్ రూమ్ కాలనీ అభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు .అంతకుముందు తెల్లాపుర్ టు బి హెచ్ కే కాలనీ లో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కలెక్టర్ పి ప్రావీణ్య లతో కలిసి పరిశీలించారు .
టు బి ఎస్ కే కాలనీలో ఇల్లు మంజూరు అయిన లబ్ధిదారులు తొందరపడి తమ ఇండ్లను అమ్ముకోవద్దని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండి గౌతమ్ అన్నారు. తొందరపడి లబ్ధిదారులు తక్కువ ధరకు తమ ఇండ్లను అమ్ముకుంటే భవిష్యత్తులో ఈ కాలనీ అభివృద్ధి చెందుతుందన్నారు. కాలనీలో ప్రభుత్వపరంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేయడానికి వెనుకడుగు వేయడం లేదన్నారు. కాలనీలో మౌలిక వసతుల కల్పనతో పాటు కాలనీ నుండి హైదరాబాదులోని అన్ని ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీస్ లు నడపడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు గృహ నిర్మాణ శాఖ ఎమ్ డి తెలిపారు. ఈ కాలనీలో లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించిన ఇల్లు బహిరంగ మార్కెట్లో 40 లక్షల పెట్టిన దొరకదని ఈ సందర్భంగా గృహ నిర్మాణశాఖ ఎండి తెలిపారు.
కొల్లూరు టు బి ఎస్ కే కాలనీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు రాష్ట్ర మంత్రులు సహకారంతో కాలనీ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కొల్లూరు టు బి ఎస్ కే కాలనీ రూపురేఖలే మారిపోతాయన్నారు. కార్పొరేట్ కంపెనీలు అందించే సిఎస్ఆర్ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రుల సహకారంతో కాలనీలో ఆయా శాఖల పరంగా చేపట్టాల్సిన అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాలనీలో ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకున్న కలెక్టర్ తెలిపారు విద్యా వైద్య సౌకర్యాల మెరుగులో భాగంగా 60 గదులతో ఉన్నత పాఠశాల నిర్మాణం పనులు 28 కోట్లతో ప్రారంభించడంతో రూ. 8 కోట్లతో ప్రారంభించడంతోపాటుపాటు, డైనింగ్ హాల్ ఏర్పాటు, కాలనీలో అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, 24 గంటల పాటు సీసీ కెమెరాలు నియంత్రణ నీడలో కాలనీ ఉండేలా చర్యలు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు సులువుగా వెళ్లి వచ్చేందుకు విలువ బస్సు సర్వీసులను నడిపేలా చర్యలు తీసుకోవడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు పోలీస్ అవుట్ పోస్ట్ లాంటి అన్ని వసతులు టు బిహెచ్కె కాలనీలో ఏర్పాటు అయ్యేలా ప్రతిష్ట ప్రణాళికతో కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు , రెవెన్యూ అధికారులు ,సంబంధిత శాఖ అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
