గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన “ఉత్తమనటి” ప్రియమణి

వాయు వేగంతో దేశం నలుదిక్కులా వ్యాపిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మధురైలోని కోయిల్ పట్టిలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన ప్రియమణి, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల (సీతమ్మ వాకిట్లో.. సిరిమల్లె చెట్టు), కెమెరామెన్ శ్యాం కే నాయుడు, క్యారెక్టర్ నటులు రామరాజు, తదితరులు.
ఈ సందర్భంగా ఉత్తమనటి ప్రియమణి మాట్లాడుతూ “నాకు చాలా సంతోషంగా ఉన్నది. షూటింగ్ కోసం నేను మధురై సమీపంలోని ‘కోయిల్ పట్టి’ కి వచ్చాను. ఇక్కడ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా చాలెంజ్ వారు నన్ను మొక్కలు నాటాలని కోరడం చాలా ఆనందంగా , సంతోషంగా ఉంది. దయచేసి అందరు కూడా మొక్కలు నాటండి. బర్త్ డే, మ్యారేజ్ డేల సందర్భంగా రకరకాల బహుమతులు కాకుండా ఇలా మొక్కలు నాటించాలని, వాటిని సంరక్షించే బాధ్యత కూడా అందరూ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.