- గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 123 కోట్ల బడ్జెట్ కేటాయించాం
- పారదర్శకత కోసం సైన్ బోర్డు ఏర్పాటు చేశాం
- రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మత్స్య శాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలు
- మధ్యాహ్న భోజనం పథకంలో చేపల ఆహారం అమలయ్యేలా సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
హైదరాబాద్ : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.మంగళవారం నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో HICC నోవాటెల్లో ఏర్పాటు చేసిన వరల్డ్ ఆక్వా కల్చర్ ఇండియా 2025 కాన్ఫఫెరెన్స్ కు ముఖ్యఅతిథిగా హాజరైన మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా మత్స్య శాఖపై రూపొందించిన పాటను మంత్రి సమక్షంలో విడుదల చేశారు.ప్రధానంగా ఈ కాన్ఫరెన్స్ లో మత్స్య సంపద, మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి పైన ప్రధాన చర్చ చేయనున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి ఇప్పటి వరకు మత్స్య శాఖ ను ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వలేదని,మొదటి సారిగా కాంగ్రెస్ ప్రభుత్వం నాకు మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.గతంలో నిర్వీర్యానికి గురైన మత్స్య శాఖను పునర్నిర్మాణం చేస్తూ నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటి క్యాబినెట్లోనే మత్స్య శాఖకు దాదాపుగా 123 కోట్ల బడ్జెట్ కేటాయించిందని తెలిపారు.మత్స్యకారులందరి తరుపున సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఒక కోటి 40 లక్షలతో రూపాయలతో మత్స్యకారులకు ఇన్సూరెన్స్ కల్పించడం జరిగిందని తెలిపారు.తెలంగాణ గోదావరి,కృష్ణా నదులు మధ్య ఉండటమే కాకుండా గొలుసు కట్టు చెరువులు ఒక గొప్ప వరం అన్నారు.ఈ నీటి వనరులు మత్స్య సంపదకు ఇది ఎంతగానో దోహద పడుతుందన్నారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మత్స్య శాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
తెలంగాణలో ఉన్న దాదాపుగా 26వేల నీటి వనరుల్లో చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వీటిల్లో 84 కోట్ల చేప పిల్లలు,10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. పారదర్శకతకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా రిజర్వాయర్లలో అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో,పెద్ద చెరువుల్లో రాదో సమక్షంలో, చిన్న చెరువుల్లో MRO ఆధ్వర్యంలో చేపపిల్లల పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు.అంతేకాకుండా చేపపిల్లల పంపిణీ సంబధించిన వివరాలు తెలియజేస్తూ చెరువు వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎలాంటి భేషాజాలకు పోకుండా అందరి సహకారంతో రాష్ట్రంలో మత్స్య శాఖ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో భారీగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి మధ్యాహ్న భోజనం పథకంలో చేపలు ఆహారం అమలయ్యేలా చూస్తామని స్పష్టంచేశారు.ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, తెలంగాణ ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల ఐఏఎస్,NFDB సీఈఓ బెహరా, జాయింట్ సెక్రటరీ నీతు కుమారి, జాయ్ కృష్ణ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐకార్, పీవీఎన్ఆర్ వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జ్ఞానప్రకాష్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు
