మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పూజారులు అతిథులకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.
సంప్రదాయ పద్ధతుల్లో పూజాదికాలు నిర్వహించారు. అనంతరం శాలువాలతో సత్కరించారు. ఆశీర్వచనాలు అందించారు.
అతిథులు తెలంగాణ ప్రజలకు పరమ పవిత్ర దినం మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ…
కీసర గుట్ట నా నియోజకవర్గ పరిధిలో వుండటం నా పూర్వ జన్మ సుకృతం. సీఎం కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రజలు పాడి పంటలతో సుఖశాంతులతో ఉండాలని ఆ రామలింగేశ్వరస్వామి ని ప్రార్ధించాను.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన కీసర గుట్ట రామలింగేశ్వర స్వామి ని దర్శించుకోవడం చాలా ఆనందంగా వుంది. సీఎం కేసిఆర్ గారి నాయకత్వములో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నిర్విరామంగా జరగాలని కోరుకున్నాను. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆ రామలింగేశ్వరస్వామి ని ప్రార్ధించాను.
శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీలు, ఎమ్మేల్యే లతో కీసర రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా వుంది.
సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా వుండాలి. కేసిఆర్, కే టీ ఆర్ ల నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నాను. ప్రాజెక్టులు పూర్తై, ప్రజలు పాడి పంటలతో, సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆ రామలింగేశ్వరస్వామి ని ప్రార్ధించాను. ఆ దేవుళ్ళ కృపా కటాక్షాలు ప్రజలపై ఉండాలని కోరాను.
ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ భోళా శంకరుడు దీవెనలు ప్రజల మీద ఉండాలి..
రాష్ట్రం ఎప్పటి లాగే సీఎం కెసిఆర్ గారి ఆధ్వర్యంలోప్రగతి పథంలో పయనించాలని కొరుకున్నాం. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.