ఈ నెల 15వ తేదీ జరగాల్సిన కేబినెట్ సమావేశం 17వ తేదీకి వాయిదా పడింది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే కేబినెట్ సమావేశం మూడుసార్లు వాయిదా పడింది. ఈ నెల 7వ తేదీన కేబినెట్ సమావేశం ఉంటుందని ప్రకటించారు. కానీ కేబినెట్ మీటింగ్‌ను 12వ తేదీకి, మళ్లీ 15వ తేదీకి వాయిదా వేస్తూ వచ్చారు. ఇవాళ సీఎం మాట్లాడుతూ.. 17వ తేదీన కేబినెట్ సమావేశం ఉంటుందని చెప్పారు. కేబినెట్‌లో స్థానిక సంస్థల ఎన్నికపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రులందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.