ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంటును ప్రపంచానికి చూపిస్తాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాం. మొదటి సంవత్సరం సాధించిన విజయాలను రాష్ట్ర ప్రజలకు చాటి చెప్పాం. ఈ రెండవ సంవత్సరం సాధించిన విజయాలతో పాటు 20 47 డాక్యుమెంట్ ను ప్రపంచానికి వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. 2047 వరకు తెలంగాణ ఏరకంగా ఉండబోతుంది, ఏ రకంగా ఉండాలి అనే విషయాలను ప్రజా ప్రభుత్వం వివరించదలుచుకుంది. ఈ విజయాలను వివరిస్తూ భవిష్యత్తును చాటి చెప్పేందుకు నగరానికి నలు దిక్కులా అవసరమైన వేదికలను పరిశీలిస్తున్నాం. భారత్ ఫీచర్ సిటీ, హైటెక్స్, గచ్చిబౌలి, దుండిగల్ తదితర ప్రాంతాలను వేదికల కోసం పరిశీలిస్తున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల ఓపెన్ ల్యాండ్ ను పరిశీలిస్తున్నాం. ఇటీవల దుబాయ్ ఫెస్టివల్ నిర్వాహనకు ఒక కొత్త నగరాన్ని దుబాయ్ బయట ప్రాంతంలో ఎంపిక చేసి నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాం. హైదరాబాదు పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతం. అద్భుతమైన వాతావరణం, తక్కువ ధరలకే నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉంటాయి అని గ్లోబల్ సమ్మిట్ లో ప్రపంచవ్యాప్తంగా తరలివస్తున్న పారిశ్రామికవేత్తలకు వివరించనున్నాం. మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, వికాస్ రాజ్, శశాంక, నర్సింహారెడ్డి, కృష్ణ భాస్కర్, ముషారఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.