సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి

సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని. అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని మీడియా వార్తలు వచ్చాయి. వెంటనే స్పందించిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీని అదేశించారు. తెలంగాణ కు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని అదేశించారు ఎం అదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ను అప్రమత్తం చేశారు. ప్రమాదం లో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు. సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో ఈ క్రింది నెంబర్ల ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు .+91 79979 59754
+91 99129 19545