బీసీలకు మరోసారి కాంగ్రెస్‌ మోసం: బీసీ రిజర్వేషన్ల సాధన సమితి అధ్యక్షుడు చిరంజీవులు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తేల్చకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్‌ సర్కారు ప్రకటించడం మరోసారి బీసీలను మోసం చేయడమేనని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి అధ్యక్షుడు టీ. చిరంజీవులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్‌ 1 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని పార్టీల నాయకులతో కలిసి భేటీకి ప్రధాని అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలిపేలా చూడటంతో పా టు, 9వ షెడ్యూల్‌లో చేర్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.