సచివాలయం లో మెగా హార్ట్ హెల్త్ క్యాంప్

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా హైదరాబాద్ లోని డా. B R అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోని మూడో అంతస్థులో సెక్రటేరియట్ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం రేనోవా హాస్పిటల్స్ సౌజన్యంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన AI Based మెగా కార్డియాక్ హెల్త్ క్యాంపు ను ప్రారంభించారు. ఈ హెల్త్ క్యాంపు కు దాదాపు 40 మంది రెనోవ హాస్పిటల్ వైద్య సిబ్బంది హాజరై అత్యాధునిక ఎక్విప్ మెంట్ సాయం తో BP , GRBS , ECG , 2D Echo మొదలగు పరీక్షలను నిర్వహించారు . కార్డియాలజీ , జనరల్ ఫీజిషన్ సేవలను free కన్సల్టేషన్ సేవలను ఉద్యోగులకు అందించారు . సచివాలయ ఉద్యోగులు మరియు అధికారులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పెద్ద ఎత్తున హాజరై తమ గుండె పనితీరును తెలియజేసే పరీక్షలను నిర్వహించుకొని , డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకున్నారు..

ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడుతూ ..మారుతున్న జీవన శైలిలలో భాగంగా ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు . ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికుందన్నారు.. సచివాలయ ఉద్యోగులకు హెల్త్ క్యాంపు పెట్టి వైద్య సేవలను , పరీక్షలను ఉచితంగా అందించిన రేనోవా ఆసుపత్రి వైద్య సిబ్బంది ని మరియు ఈ మెగా క్యాంప్ ఏర్పాటుకు కృషిచేసిన సచివాలయ సంఘం ప్రతినిధులను మంత్రి దామోదర్ రాజనర్సింహా అభినందించారు. అలాగే ఎంపీ బలరాం నాయక్ పాల్గొని అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకొని క్యాంపు జరుగిన పనితీరును అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీగిరి శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రేమ్ మరియు కార్యవర్గ సభ్యులు, రెనోవా హాస్పిటల్స్ డైరెక్టర్ టీవీ నగేష్ గారు, డాక్టర్ సోహెబ్ అహ్మద్, డాక్టర్ జవహర్ కార్డియాలజిస్టులు, మిస్టర్ రవీంద్రనాథ్ సి ఓ ఓ, డాక్టర్ శివకుమార్, కుమారి నితిజ్ఞ హర్కరా, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ స్టేట్ IT హెడ్, రాఘవేందర్ రెడ్డి ఏఐపిసి, తదితరులు హాజరయ్యారు.