తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రం దేశంతోనే కాదు, ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇందిరమ్మ రాజ్యం లో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి తయారు చేసిన తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ రోడ్డు మ్యాప్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సెలబ్రేషన్లో సమాజం ముందు ఉంచబోతున్నాం. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్పాటు అయ్యి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ పేరిట డిసెంబర్ 1 నుంచి ఆరవ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల వారిగా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. డిసెంబర్ 1న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ , డిసెంబర్ 2న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, డిసెంబర్ 3 న వరంగల్ ఉమ్మడి జిల్లాలోని హుస్నాబాద్ , 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, 5 న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట , 6న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తాం.

ఉమ్మడి జిల్లాలో జరిగే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు. రాష్ట్రానికి ఐకానిక్ గా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలపై మేధావులతో కలిసి ఆలోచన చేస్తారు. డిసెంబర్ 8,9 న ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తాం. 8 నాడు జరిగే ఉత్సవాల్లో ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో అందించిన ప్రజాపాలన చేపట్టిన అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలను చాటి చెప్తాం.

తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ లో భాగంగా డిసెంబర్ 9 న త్రీ మిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చడానికి భవిష్యత్ లో ఏం చేయబోతున్నాం. ఎలాంటి అభివృద్ధి చేస్తామో దానికి సంబంధించిన విజన్ డాక్యుమెంటరీని విడుదల చేసి సమాజం ముందు ఉంచుతాం. గ్లోబల్ సమ్మిట్ లో విడుదల చేసే తెలంగాణ విజన్ తిలకించడానికి దేశంతో పాటు ప్రపంచంలో వివిధ రంగాల్లో విజయాలు సాధించిన వ్యవస్థలు వాటికి నాయకత్వం వహించిన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నాం. గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రజలందరూ చూసేలా డిసెంబర్ 11,12,13 అవకాశం ఇస్తాం. తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ సెలబ్రేషన్ లో భాగంగా తెలంగాణ ప్రపంచాన్ని ఆకర్షించడానికి ఫుట్బాల్ క్రీడారంగంలో అత్యున్నత స్థాయి సాధించినటువంటి దిగ్గజ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ ని హైదరాబాద్ కు ఆహ్వానించి డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ ను నిర్వహిస్తున్నాము.