ఫ్యూచర్ సిటీ లో “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు

ఫ్యూచర్ సిటీ లో “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు. గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద సీఎస్, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి. సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు. అయిదో తేదీ లోపు పనులన్నీ పూర్తి చేసి… ఆరో తేదీన డ్రై రన్ కండక్ట్ చేయాలని అధికారులకు ఆదేశాలు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా… తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు. ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు. విభాగాల వారీగా అప్పగించిన బాధ్యతలు, వాటి పురోగతిపై సమీక్ష. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే డెలిగేట్స్… మన అతిథులు, వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆదేశాలు. పార్కింగ్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు.