- అత్యవసర సాయం కింద లక్ష రూపాయల చెక్కు అందజేత
- బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం
- బాలుడికి పెన్షన్, స్పెషల్ పాఠశాలలో అడ్మిషన్.
- బాలుడు తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వం పరంగా అన్ని సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చిన మంత్రి అడ్లూరి
హైదరాబాద్: ఎల్బీనగర్ మన్సురాబాద్ సమీపంలోని శివగంగా కాలనీలో ప్రేమ్ చంద్ అనే ఒక బాలుడిపై కుక్కల కరిచిన ఘటనపై ఎస్సీ ఎస్టీ దివ్యంగుల సంక్షేమ శాఖ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న ఈ ఘటనపై వార్త కథనాలకు స్పందించి వెంటనే సీఎం గారు ..తనకు కు ఫోన్ చేసి సత్వరమే..ప్రేమ్ చంద్ కు తగిన వైద్య సదుపాయం, ఆర్థిక సహాయంతో పాటు కుటుంబానికి అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు బుధవారం.. నీలోఫర్ ఆస్పత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్న బాలుడిని మంత్రి అడ్లూరి స్వయంగా కలిసి పరామర్శించారు. ప్రేమ చంద్ తల్లి దండ్రులు. ….C తిరుపతి రావు , చంద్రకళ దంపతులకు మంత్రి ఒక లక్ష రూపాయల చెక్కును అందించారు.
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరి చేస్తామని మంత్రి తెలిపారు. బాలుడికి స్పెషల్ స్కూల్ లో అడ్మిషన్ కూడా ఇప్పించి చదువును కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ హృదయ విదారక ఘటన తనను ఎంతో కలిచి వేసిందన్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల బృందం నిలోఫర్ ఆసుపత్రి చేరుకొని చికిత్స పొందుతున్న బాలుడి తల్లిదండ్రులను కలసి వివరాలు సేకరించినట్లు మంత్రి చెప్పారు. బాధిత బాలుడి తండ్రి వినతిని పరిగణలోకి తీసుకొని, బాలుడి సంపూర్ణ వైద్య సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం దగ్గరుండి చేసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. బాలుడికి అవసరమైన సహాయక చర్యలన్నీ ప్రభుత్వం నుంచి అందిస్తున్నామని ఆయన తెలిపారు. మంత్రి అడ్లూరి ఆదేశాల మేరకు బాలుడికి సంబంధిత శాఖ అధికారులు ఆ బాలుడికి దివ్యాంగుల గుర్తింపు కార్డు తక్షణమే జారీ చేయడం జరిగింది. అలాగే అర్హత ప్రకారం దివ్యాంగ పింఛను మంజూరు చేయటం అలాగే కోలుకున్న తర్వాత బాలుడికి కావలసిన సంరక్షణ కు కావలసిన సదుపాయాలు పూర్తిగా కల్పించడం దీంతో పాటు వైద్య చికిత్స, పునరావాస సహాయ అందించడం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎప్పుడు , ఎక్కడ, చోటు చేసుకున్న జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారులు ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబాలను సందర్శించి, అవసరమైన సేవలు, సహాయం వెంటనే అందించాలని కూడా మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్, డైరెక్టర్ శైలజ, నిలోఫర్ ఆసుపత్రి Superindentent విజయ్ కుమార్, ఆర్ ఎం ఓ డా ఆనంద్, లాలూ ప్రసాద్, బాబురావు ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.