ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై జూబ్లీ హిల్స్ నివాసం లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు,సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా , సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన,ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, ఉన్నతాధికారులు. వీసీ, ప్రొఫెసర్ల తో కలిసి అధికారులు యూనివర్సిటీ లో పర్యటించాలి. ఈ నెల 10 న యూనివర్సిటీ ని సందర్శిస్తా. విద్యార్థుల సంఖ్య ఆధారం గా యూనివర్సిటీ లో భవన నిర్మాణాలు ఉండాలి. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధం ఉన్నాం. భవనాల మరమ్మతు ల కంటే కొత్త భవనాలు నిర్మాణం పైనే దృష్టి పెట్టాలి. యూనివర్సిటీ అభివృద్ధి ప్రణాళిక పైన విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోవాలి. విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని డిసెంబర్ 31 న పూర్తి ప్రణాళిక ను ప్రకటించాలి. బెస్ట్ యూనివర్సిటీ గా ఉస్మానియా ను తీర్చిదిద్దాలి. ప్రపంచం తో పోటీపడేలా యూనివర్సిటీ విద్యార్థులను తీర్చిదిద్దాలి. యూనివర్సిటీ అధ్యాపకులను విదేశాలకు పంపి శిక్షణ ఇవ్వాలి.