తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తామని వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్శించేలా తెలంగాణ పర్యాటక అందాలు, చారిత్రక ప్రదేశాల ఛాయచిత్రాలను డిజిటల్ స్క్రీన్ లో (కాగితపు రహిత- పేపర్ లెస్) పర్యాటక శాఖ ప్రదర్శించింది. రాష్టంలో ఎక్కడెక్కడ ఏయే పర్యాటక ప్రాంతాలున్నాయో తెలుసుకునేలా టచ్ కియోస్క్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. అద్భుతమైన బహుమతులను గెలుచుకోండి! అని చెప్పారు. నూతన పర్యాటక విధానం 2025-2030తో పునరుత్తేజం వచ్చింది.. నూతన పర్యాటక పాలసీపై ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపుతున్నారు, త్వరలోనే పర్యాటక రంగం మరింత పురోభివృద్ధి సాధిస్తుందని భావిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరు, తదితరులు పాల్గొన్నారు.