- సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయం తెలంగాణ భవిష్యత్తు ఆశయాలను నిర్దేశిస్తుంది
- గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ ఆశయాలకు వేదికను నిర్మించాం
- సమ్మిట్ లో విద్యుత్ వినియోగదారుడుగా కాదు ఉత్పత్తిదారుడుగా మారాలన్న సంకల్పాన్ని చూశాను
“తెలంగాణ రైజింగ్ 2047” విజన్ రూపకల్పనలో చూపిన నిజమైన భాగస్వామ్య భావానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కొద్ది మంది గదిలో కూర్చొని చేసిన పని కాదు, విస్తృతమైన, వైవిధ్యమైన వర్గాల జ్ఞానం, ఆశయాలు కలిసిన సమిష్టి సృష్టి, ఈ విజన్ పత్రం ఒక శాఖ పని కాదు, ఒక నిపుణుల బృందం రాసింది కాదు. నెలల తరబడి ఫీల్డ్ పర్యటనలు, ప్రజా చర్చలు, స్థానికుల అభిప్రాయాలు ఇవన్నీ కలసి రూపొందిన జీవ పత్రం ఇది అని డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్ర మంత్రులు లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పారు,
అధికారులు భూమ్మీదున్న వాస్తవాలను తీసుకొచ్చారు, చింతన నాయకులు, విద్యావేత్తలు మేధోపరమైన లోతు అంశాలను జోడించారు, అత్యంత ముఖ్యంగా రైతులు, యువత, వ్యాపారులు, కూలీలు వేలాదిగా తమ భవిష్యత్తు గురించి ఆశలు, సూచనలు పంచుకున్నారు అని డిప్యూటీ సీఎం అన్నారు. అలాగే ఈ పత్రాన్ని తుది రూపంలోకి తీసుకురావడంలో సహకరించిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు డా. సుమన్ బెర్రీ గారికి, సీఈఓ గారికి, నీతి ఆయోగ్ అధికారులకు, అలాగే ఈ పత్రాన్ని మెరుగుపర్చడంలో ఎంతో కృషి చేసిన ఐఎస్బీ డీన్ మదన్ pillutla గారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ విజన్ డాక్యుమెంట్ మనందరిది అన్నారు. మరో ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేసుకోవాలనుకుంటున్నాను, ప్రపంచ సదస్సుల్లో నాయకులతో పాటు ఒక “షెర్పా” ఉంటాడు ప్రతీకాత్మకంగా, కఠినతలను దాటడానికి మార్గం చూపే ప్రేరణ. ఈ సదస్సుకూ అటువంటి ఒక షెర్పా ఉంటే, అది తెలంగాణకు హక్కైన గుర్తింపునిచ్చిన చారిత్రాత్మక నిర్ణయం నుంచి పుట్టిన ధృఢసంకల్పం ఇది అన్నారు.
ఈ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా, ఇది రాజకీయ వేదిక కాదని తెలిసినా, ఆ నిర్ణయం వెనుక ఉన్న నిశ్శబ్దమైన ధైర్యాన్ని స్మరించుకోవడానికి మీ అనుమతిని కోరుతున్నాను అన్నారు. ఆ నిర్ణయం మన గతాన్ని మాత్రమే కాదు, మన భవిష్యత్ ఆశయాలనూ నిర్ధేశిస్తూ ఉంది అని డిప్యూటీ సీఎం వివరించారు. ఇక సమ్మిట్ విషయానికొస్తాను. “సమ్మిట్” అనే పదం గురించి ఆలోచిస్తున్నాను. నిజానికి, సమ్మిట్ లు రెండు రకాలున్నాయి. మొదటిది — పేరులో ఉన్నట్లే. అందరి ప్రసంగాలు, సూచనలు తీసుకుని మొత్తం కలిపితే అవుతుంది. ఇది గణితం. “SUM + IT”. అయితే రెండో రకం మనం ఈ రోజు చూశాం. దాన్ని “sum” చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ సమ్మిట్ ప్రాంగణంలో సృష్టించబడింది మొత్తం భాగాల కంటే ఎక్కువ. ప్రతి సెషన్ కొత్త ఆలోచనలను జోడించలేదు అవకాశాలను గుణించిందీ. సమిష్టి శక్తి నిజమైనది, సహజమైనది గణితాన్ని దాటి ఉంది అన్నారు. ఈ సదస్సు ఆ రెండో రకానికి సంబంధించింది అని వివరించారు. దాన్ని “sum” చేయడం అసాధ్యం — ఎందుకంటే ప్రభావం అనంతం అన్నారు. ఎందుకు? ఎందుకంటే తెలంగాణకు ఆశలు ఎప్పటి నుంచో ఉన్నాయి. లేకపోయింది ఒక్కటే ఆ ఆశయాల స్థాయికి సరిపోయే, సుదీర్ఘమైన, సమగ్ర, భవిష్యత్దృష్టి కలిగిన రూపకల్పన. ఈసారి, మనం పత్రాన్ని మాత్రమే కాదు వేదికను కూడా నిర్మించాం అని డిప్యూటీ సీఎం అన్నారు. క్యాపిటల్ మార్గదర్శకాలు నుంచి వ్యవసాయ విలువ శృంఖలాలు, ఫ్రంటియర్ టెక్నాలజీ నుంచి అటవీ ఆర్థిక వ్యవస్థల వరకు ప్రజలు కేవలం మాట్లాడకుండా, కట్టుబడి పనిచేయడానికి సిద్ధమయ్యారనే భావన వచ్చింది అన్నారు. తాను అధ్యక్షత వహించిన రెండు సెషన్ల గురించి చిన్నగా చెప్పాలనుకుంటున్నాను ఉత్పాదకత, విద్యుత్ అని తెలిపారు. విద్యుత్ సెషన్లో వినియోగదారుడిగా కాకుండా, ఉత్పత్తిదారుడిగా మారాలనుకునే తెలంగాణను చూశాను గ్రీన్ హైడ్రజన్, డిస్ట్రిబ్యూటెడ్ రిన్యూవబుల్స్, స్మార్ట్ గ్రిడ్స్ దారిని చూపించాయి అన్నారు.
ఉత్పాదకత సెషన్లో భారత్ తదుపరి దూకుడు కేవలం కష్టపడి కాదు, తెలివిగా సిస్టమ్‌లు నిర్మించడం ద్వారా వస్తుందని ఏకాభిప్రాయం ఏర్పడింది, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, శక్తివంతమైన కార్మికులు, అవుట్‌పుట్ ఆధారిత ఆవిష్కరణలతో ఇవి ఏవీ ఊహాజనిత విషయాలు కావు. ఇవే తెలంగాణ అసలు బలం అన్నారు. అందుకే మళ్లీ చెబుతున్నాను, ఇది స్థిర పత్రం కాదు. ఇది అభివృద్ధి చెందుతుంది. కొత్త డేటా, కొత్త భాగస్వామ్యాలు, కొత్త జ్ఞానం ఇవన్నీ వస్తే మారుతుంది. ఫీడ్‌బ్యాక్‌ను మనం భయపడము స్వాగతిస్తాము అన్నారు.
ఈ సదస్సుకు హాజరైన ప్రతి తెలంగాణ యువకుడూ భవిష్యత్తుకు మార్గం వేయగలిగిన విలువైనదేదో నిర్మించాలి, రాబోయే తరాలు మీ మార్గంలో అక్షరాలా నడవాలి అని ఆకాంక్షించారు. గౌరవ అతిథులారా మీ ఐక్యతకు, మద్దతుకు ధన్యవాదాలు. ప్రభుత్వ సహచరులారా సమన్వయం ఎలా ఉండాలో మీరు చూపిచారు. ఈ సదస్సును నిర్వహించిన మా బృందం, పాల్గొన్న ప్రతిఒక్కరికి — మనం నిర్వహించిన ఈ సమ్మిట్‌ను… మనమే “sum” చేయలేమని నిరూపించినందుకు ధన్యవాదాలు అన్నారు.