నగరి ఎమ్మెల్యే రోజాతో కలిసి మొక్కలు నాటిన ఎంఈఓ శ్రీదేవి

ఆంధ్రప్రదేశ్ లో సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా గ్రీన్ చాలెంజ్ ని ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా రోజావనం పేరుతో మొక్కలు నాటుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు నగరి మండల ఎంఈఓ శ్రీదేవితో కలిసి మొక్కలు నాటారు. అలాగే మరో ముగ్గురికి చాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీదేవి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కి ఎమ్మెల్యే రోజా చేపడుతున్న కార్యక్రమం ఎంతో అద్భుతమని రోజాతో కలిసి ఈ మొక్కలు నాటడం చాలా అదృష్టంగా ఉందని తెలియజేశారు. నాతో పాటు ఇంకో ముగ్గుర్ని నామినేట్ చేసి వాళ్లను కూడా మొక్కలు నాటాలని కోరారు.