- ఆసక్తికరంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంశం పై సదస్సు
హైదరాబాద్: ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే థీమ్‌తో కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఓపెన్ డే కు మూడవ రోజు శుక్రవారం నాడు వేలాది మంది తో కిటకిటలాడింది. “రియల్ లైఫ్‌లో రిజిలియెన్స్” అనే అంశంపై ప్రారంభమైన నేటి సెషన్ కు నగరంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు హాజరై చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చలో, వేగంగా మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో రిజిలియెన్స్ యొక్క ప్రాముఖ్యత, వ్యక్తిగత, వృత్తి పరంగా ఎదురయ్యే ఒత్తిడులు, సవాళ్లను ఎదుర్కోవడం, కొత్త మార్పులకు త్వరగా అలవాటు పడే నాయకత్వ నైపుణ్యాలు, AI, ML వంటి ఆధునిక సాంకేతికతల నేపథ్యంలో భవిష్యత్ సిద్ధత, యువతలో గ్రోత్-మైండ్‌సెట్, సమస్య పరిష్కార దృష్టికోణాన్ని అభివృద్ధి చేయడం తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఈ సదస్సులో జి. సత్యనారాయణ, మాజీ చైర్మన్, UIDAI; మాజీ ఐఏఎస్, జితేంద్ర పుచ్చ, చీఫ్ డెలివరీ ఆఫీసర్, మాస్టెక్ డిజిటల్, శ్రీనివాస్ అత్రేయ, CTO, అవికా, కిషోర్ ఉప్పలపాటి, CEO, Qylis లు పాల్గొన్నారు. ఈ సెషన్‌లో ముఖ్యంగా ఆకర్షణీయమైన అంశం విద్యార్థుల అద్భుతమైన పాల్గొనడం. వేలాది మంది మధ్య జరిగిన ఈ చర్చలో విద్యార్థులు ఎంతో చురుకుగా ప్రశ్నలు అడిగారు, ప్యానెల్‌తో మమేకమయ్యారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులతో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏరోస్పెస్, మూసీ రివర్ డెవలప్మెంట్, హ్యాండీ క్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్,,కరీంనగర్ ఇక్కత్, ఫిలిగ్రి,చేర్యాల పెయింటింగ్స్, సైబర్ క్రైమ్ చెదనలో ఉపయోగించే పలు ఆధునాతన పరికరాలు,డ్రోన్స్ , రోబో తదితర 27 కు పైగా స్టాళ్లను సందర్శకులు అత్యంత ఆసక్తిగా తిలకించారు. ప్రధానంగా, ఆధునిక పరికరాలు, వైమానిక అంశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కాగా, రేపు చివరి రోజైన శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటలవరకు ఈ గ్లోబల్ సదస్సు ను సందర్సించవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం నాడు అగ్రికల్చర్, రురల్ ట్రాన్స్ఫర్మేషన్ , ఫార్మర్స్ రైసింగ్ అనే అంశంపై సదస్సు జరుగుతుందని ఆ ప్రకటనలో వెల్లడించారు. ఈ రోజు కార్యక్రమానికి దాదాపు ఆరువేలు పైగా హాజరు కాగా వీరిలో ఐదు వేళా మంది విద్యార్థులు,1000 ప్రజలు పాల్గొన్నారు.